కంటెంట్ | Sericulture Information Linkages And Knowledge System2 Sericulture Information Linkages and Knowledge System, SILKS
సిల్క్స్

పట్టుపురుగుల పెంపకంలో నిమగ్నమైన రేతులు,

పట్టు సమాచార సూచిక

ఎంపిక చేయబడ్డ 107 జిల్లాల్లో ప్రతి జిల్లాకు సిల్క్స్ అభివృద్ధి చేయబడింది.ఇందులో 13 ప్రాదేశికేతర మాడ్యూల్స్ అదేవిధంగా నాలుగు ప్రాదేశిక మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిని మూడు కేటగిరీలుగా విభజించారు. ముఖ్యంగా ప్లానింగ్ సర్వీసెస్, ఇతర సర్వీసెస్ మరియు సహజ వనరుల యాజమాన్యం. ప్లానింగ్ సర్వీసెస్ కింద సిల్క్ వార్మ్ ఫుడ్ ప్లాంట్ ప్రొడక్షన్ టెక్నాలజీస్, పుట్టుపురుగుల పెంపకంలో మెలకువలు, ఆహార పంటలు, పట్టుపురుగుల ఆహార మొక్కల్లో వచ్చే చీడలు మరియు సస్యరక్షణ, పట్టుపురుగుల ఆహార మొక్కల్లో అభివృద్ధి చెందిన రకాలు, పట్టుపురుగుల జాతులు, కాకూన్ల యొక్క ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు మరియు పరికరాలు మరియు అనుబంధ రంగాలు మరియు వృత్తులు. ఇతర సర్వీసులో మైక్రో క్రెడిట్ మరియు స్వయం సహాయక బృందం, సెరీ మార్కెటింగ్, విత్తన పంపిణీ కేంద్రాలు, వీవింగ్ రీలింగ్ సెంటర్లు మరియు రైతుల కొరకు పథకాలు మరియు గ్రాంట్ల వివరాలు ఉంటాయి.

పట్టుపురుగుల ఆహార పంటల కొరకు సంభావ్య స్థలాలు, మట్టి మ్యాప్, వాతావరణ పరిస్థితులు మరియు యుటిలిటీ మ్యాప్ అనే నాలుగు మాడ్యూల్స్ లో ప్రాదేశిక డేటా మరియు సంబంధిత గణాంకాలు ఉంచబడ్డాయి. ఈ ప్రాదేశిక మాడ్యూల్స్ లో 950 ప్రాదేశిక సమాచార పొరలున్నాయి. ఒపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ప్యాకేజీలు కస్టమైజ్ చేయబడ్డాయి మరియు యూజర్ విజువలైజ్, జూమ్ – ఇన్, జూమ్ – అవుట్, పాన్, ప్రాదేశిక ఫీచర్లను గుర్తించడం, ప్రశ్నించడం, మ్యాప్ సమాచారం గుర్తించడం మొదలైన వాటికి అవకాశం కల్పించే విధంగా అభివృద్ధి చేయబడ్డాయి.

silks