మల్బరీ ఆహార పంట మొక్కల్లో వ్యాధులు మరియు తెగుళ్లు
1. ఆకు తెగుళ్లు
1. ఆకు మచ్చ
వ్యాధికారకం: సెర్కోస్పోరా మారికోలా
సంభవించడం: ఇది వర్షాకాలంలో ఎక్కువగావిస్తరిస్తుంది మరియు ఇది తరువాత శీతాకాలంలోనూ వృద్ధి చెందుతుంది. కత్తిరింపు(డిఎపి) లేదా ఆకులను కోసిన 35 నుంచి 45రోజుల్లోగా ఇది
సంభవిస్తుంది. డిఎపి యొక్క 70వ రోజుకు ఇది తీవ్రంగా ఉంటుంది.
పంట నష్టం: 10 నుంచి 12శాతం
రోగలక్షణాలు:బూడిదరంగులో ఉండే మచ్చలు మరియు అపక్రమ ఆకారంలో ఉండే మచ్చలు ఆకు ఉపరితలం మీద కనిపిస్తాయి. మచ్చలు విస్తరించి, ఒకదానినొకటి కలుసుకుంటాయి చివరకు ఆకుపై
రంధ్రాన్ని ఏర్పరుస్తాయి. ఆకులు పచ్చగా మారతాయి మరియు వ్యాధి తీవ్రతను బట్టి ఎండిపోతాయి.

ఆకుమచ్చ
వ్యాధి విస్తరించడానికి కారకాలు:
- ఈ చీడ గాలి ద్వారా వ్యాపిస్తుంది మరియు వర్షపు బిందువుల ద్వారా ప్రధానంగా కొనిడీయా విస్తరిస్తుంది
- ఉష్ణోగ్రత 24నుంచి 26 డిగ్రీలు మరియు సాపేక్ష తేమ 70 నుంచి 80 శాతం ఉన్నప్పుడు ఈ చీడ గరిష్ట విస్తరిస్తుంది.
తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలు
- ఆకులపై 0.2శాతం బావిస్టన్ (కార్బొబెండాజియం 50% డబ్యుపి)ని పిచికారీ చేయండి
- సురక్షిత కాలం: 5 రోజులు
2. బూజు తెగులు
వ్యాధికారకం: ఫైలాసిటినియా కారిలియా
సంభవించడం: ఇది ముఖ్యంగా శీతాకాలం మరియు వర్షాకాలాల్లో విస్తరిస్తుంది. కత్తిరింపు(డిఎపి) లేదా ఆకులను కోసిన 40రోజుల సమయంలో ఇది వృద్ది చెందుతుంది. డిఎపి యొక్క 70వ
రోజుకు ఇది తీవ్రంగా ఉంటుంది.
పంట నష్టం: 5 నుంచి 10శాతం
లక్షణాలు: తెల్లటి పొడిలాంటి మచ్చలు ఆకుయొక్క దిగువ ఉపరితలం మీద కనిపిస్తాయి. ఆకు యొక్క ఎగువ ఉపరితలంలో సంబంధిత ప్రాంతంలో మచ్చలు కనిపిస్తాయి. తీవ్రంగా ఉన్నప్పుడు ఈ
తెల్లని పొడిలాంటి ఈ మచ్చలు బూడిదరంగు `నల్లగా మారతాయి., ఆకులు పసుపుగా మారతాయి, ఆకులు సున్నితత్త్వం కోల్పోయి, పోషకవిలువలను సైతం కోల్పోతాయి

బూజు తెగులు
చీడ విస్తరించడానికి కారణాలు
- ఈ చీడ ప్రధానంగా గాలి ద్వారా విస్తరిస్తుంది, మరియు ఇది ప్రాథమికంగా గాలి ద్వారా విస్తరిస్తుంది.
- ఉష్ణోగ్రత 24 నుంచి 28డిగ్రీలుగా ఉన్నప్పుడు మరియు సాపేక్ష తేమ 75నుంచి 80శాతం ఉన్నప్పుడు ఈ చీడ సోకడానికి మరియు అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది.
తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలు:
- మొక్కల మధ్య ఎక్కువ స్థలం ఉండే విధంగా( 90సెంమీ X90 సెంమీ) లేదా జంట వరసల విధానం( 90 +150) 60 సెంమీ విధానం అనుసరించాలి.
- ఆకు యొక్క దిగువభాగంలో 0.2శాతం కారథాన్( డినోక్యాప్ 30శాతం ఈసి)/బావిస్టన్‌ను పిచికారీ చేయాలి. సురక్షిత కాలం 5 రోజులు
- లేదా సల్ఫెక్స్( 80డబ్యుపి) 0.2శాతాన్ని పిచికారీ చేయండి, సురక్షిత కాలం 15రోజులు.
3. ఆకు తప్పు
కారకం సెరోటిలియం ఫికి
సంభవించడం:ఈ చీడ శీతాకాలం మరియు వర్షాకాలాల్లో ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. ఇది 45 నుంచి 50 రోజుల డిఎపి రోజుల్లో పురోభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది మరియు 70వ డిఎపి నాటికి తీవ్రతరం
అవుతుంది. బాగా ఎదిగిన ఆకులు ఈ తెగులు బారిన పడటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది.
పంట నష్టం:10 నుంచి 15శాతం
చీడలక్షణాలు: ప్రాథమికంగా సన్నటి బూడిదరంగు మచ్చలు ఆకుల మీద కనిపిస్తాయి, తరువాత ఆకులు పసుపురంగులోనికి మారి, రాలిపోతాయి.

తుప్పు తెగులు
చీడ విస్తరించడానికి ప్రధాన కారణాలు:
- ఇది గాలి ద్వారా సంక్రమిస్తుంది. నీటి బిందువులు మరియు గాలి ద్వారా ఇది విస్తరిస్తుంది.
- ఉష్ణోగ్రత 22 నుంచి 26డిగ్రీలుగా ఉన్నప్పుడు మరియు సాపేక్ష తేమ 70 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చీడ సోకడానికి మరియు అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది.
తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలు
- మొక్కల మధ్య ఎక్కువ స్థలం ఉండే విధంగా( 90సెంమీ 90 సెంమీ) లేదా జంట వరసల విధానం( 90 G150) 60 సెంమీ విధానం అనుసరించాలి.
- ఆకును ఆలస్యంగా కోయడాన్ని పరహరించాలి.
- ఆకుపై కావాచ్ 0.2శాతం(క్లోరో థయోలిన్ 75శాతం డబ్యుపి)ని పిచికారీ చేయాలి.
- సురక్షిత కాలం: 5 రోజులు
4. మసి బూజు
కారకం: ఫంగస్ సమూహం
సంభవించే కాలం: ఈ చీడ ఎక్కువగా శీతాకాలంలో(ఆగస్టు నుంచి డిసెంబర్) వస్తుంటుంది
పంట నష్టం: 10 నుంచి 15శాతం
లక్షణాలు: ఆకుల యొక్క పై ఉపరితలంపై నల్లని మందమైన పొర అభివృద్ధి చెందుతుంది.
చీడలు విస్తరించడానికి కారకాలు:
- మల్బరీ తోటలో తెల్లదోమ ఉండటం వల్ల ఈ చీడ విస్తరిస్తుంది.
- తెల్లదోమల ద్వారా ఉత్తత్తి చేయబడ్డ తేనె లాంటి పదార్థంపై ఫంగస్ అభివృద్ధి చెందుతుంది.
- ఉష్ణోగ్రత 22 నుంచి 24డిగ్రీలుగా ఉన్నప్పుడు మరియు సాపేక్ష తేమ 70 శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చీడ సోకడానికి మరియు అభివృద్ధి చెందడానికి కారణం అవుతుంది.
తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలు
- స్పోరోఫైటిక్ ఫంగస్ యొక్క ఎదుగుదలను పరిశీలించడం కొరకు 0.2శాతం ఇండోఫిల్ -ఎమ్45ని పిచికారీ చేయాలి.
- తెల్లదోమను నియంత్రించడానికి ఆకు కోసి 15 మరియు 30వ రోజుల్లో 0.02శాతం మోనోక్రోటోపాస్‌ను ఆకులపై పిచికారీ చేయాలి.
- సురక్షిత కాలం: 15 రోజులు
1. వేరు చీడలు
1. వేరు ముడి
కారక సూక్ష్మజీవి: మెలోడియోజైన్ ఇన్‌కాగ్నిటా( నెటటోడ్)
సంభవించడం: ఈ చీడ సంవత్సరం మొత్తం విస్తరిస్తుంది. నీటి పారుదల సదుపాయాలు సరిగ్గా లేని ఇసుక నేలల్లో ఇది వ్యాపిస్తుంది.
పంట నష్టం: 20శాతం
లక్షణాలు:
- తీవ్రంగా సోకిన మల్బరీ మొక్కల్లో ఎదుగుదల నిలిచిపోతుంది, అదేవిధంగా ఆకుల్లో అతి తక్కువ తేమ ఉంటుంది. తరువాత ఆకుల యొక్క అంచులు పసుపురంగులోనికి మారతాయి.
- వేర్లపై ముడులు లేదా కాయలు వంటివి ఏర్పడటం ఈ చీడ యొక్క లక్షణాలుగా పేర్కొనవచ్చు.
- ఈ కాయలు గుండ్రంగా విభిన్న పరిమాణాల్లో ఉంటాయి. లేత కాయలు మరింత చిన్నవిగాను మరియు పసుపు తెలుపు రంగుల్లోనూ, ముదురు కాయలు పెద్దవిగాను మరియు పాలిపోయిన బూడిదరంగులోనూ ఉంటాయి.

వేరు ముడి మెటటోడ్ చీడ
ఈ చీడ విస్తరించడానికి కారణాలు
- కలుషితమైన మట్టి, పొలంలో ఉపయోగించిన పరికరాలు కలుషితం కావడం మరియు నీటిపారుదల సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి విస్తరిస్తుంది.
- చీడ సోకిన కలుపు మొక్కల్ని ఇతర మొక్కలతో కలిపి నాటం వల్ల ఈ చీడ తీవ్రత మరింత పెరగడానికి కారణం అవుతుంది. మల్బరీ తోటలోను, తోట వెలుపల ఉన్న కొన్ని రకాల కలుపు మొక్కలు సంక్రామ్యతకు ద్వితీయ
కారకాలుగా పనిచేస్తాయి.
- 27 నుంచి 30డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత, మట్టిలో తేమ 40శాతం కంటే తక్కువగాను మరియు పిహెచ్ విలువ5 నుంచి 7గా ఉన్నప్పుడు ఈ చీడ వృద్ధి చెందడానికి అనుకూలంగా ఉంటాయి.
నియంత్రణ చర్యలు:
- ప్రతి సంవత్సరం ఎకరం పొలానికి 800కిగ్రాల వేప నూనె చెక్కను నాలుగు సార్లుగా చల్లాలి. మొక్క నాటడానికి ముందు, మొక్కనాటిన తరువాత అదేవిధంగా ఆకులు కోయడానికి ముందు, ఆకులు కోసిన తరువాత ఇలా
నాలుగుసార్లు వేయాలి. మొక్క యొక్క వేరు ప్రాంతంలో 10 నుంచి 15సెంమీ లోతు గుంటలు చేసి, దానిలో వేసిన తరువాత మట్టితో పూడ్చి, నీటిని పెట్టాలి.
2. వేరు కుళ్లు
సంభావ్య కారణం: రైజోకొటోనియా బాటాటికోలా (మార్కోఫోమినా ఫాసియోలినా)
అనుబంధ ద్వితీయ సూక్ష్మజీవులు: ఫుసారియం సొలానీ/ఎఫ్. ఆక్సోస్పోరమ్/బట్రోడియోప్లోడియా త్రియోబ్రోమైనీ
సంభవించడం: సంవత్సరం మొత్తంలో అన్ని రకాలు మట్టిల్లో మరిముఖ్యంగా మట్టిలో తేమ మరియు సేంద్రియ పదార్థాలు తక్కువగా ఉన్నప్పుడు ఇటువంటివి చోటుచేసుకుంటాయి.
పంట నష్టం: మట్టి ఆరోగ్యం మరియు క్లైమేట్‌ను బట్టి 15శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు: ప్రాథమికంగా మొక్క హటాత్తుగా ఎండిపోవడం ఆకులు దిగువ కొమ్మల నుంచి రాలిపోవడం ప్రారంభించి, అది క్రమేపీ పై వరకు వెళ్లడం వంటి బాహ్య లక్షణాలు కనిపిస్తాయి.

వేరు కుళ్లు యొక్క భూమి పై లక్షణాలు( ఆకులు పసుపుగా మారడం/ ఆకులు ఎండిపోవడం)
- వేరు కాండ త్వచం క్షీణించడం, ఫంగస్/ బెరడు క్రింద మైసీలియం వల్ల నలుపు రంగుగా మారడం వంటి భూమి దిగువ లక్షణాలు కనిపిస్తాయి.(పటం13)
- తీవ్రంగా ఈ చీడ ప్రభావానికి గురైన మొక్కలు మట్టిలో పట్టుకుని ఉండే సామర్థ్యాన్ని కోల్పోతాయి మరియు తేలికగా పెళ్లగించవచ్చు.
- తీవ్రతను బట్టి, మొత్తం వేరువ్యవస్థ దెబ్బతింటుంది మరియు మొక్క మరణిస్తుంది.
- కత్తిరింపు తరువాత చీడ సోకిన మొక్కలు, మొలకెత్తలేకపోతాయి లేదా మొలకెత్తినప్పటికి కూడా చిన్నగా మరియు గరుకు ఉపరితలాలను కలిగిన పసుపురంగు ఆకుల్ని కలిగి ఉంటుంది.

వేరు కుళ్లు యొక్క భూమి లోపల రోగలక్షణాలు ( వేర్లు కుళ్లిపోవడం
ఈ చీడ వ్యాపించడానికి కారణాలు:
- గరిష్ట ఉష్ణోగ్రత (28 నుంచి 34 డిగ్రీలు), తక్కువ తేమ(40శాతం కంటే తక్కువ) మరియు అతి తక్కువ సేంద్రియ పదార్థం ఉన్న నేలల్లో ఈ చీడ వ్యాపిస్తుంది.
- ఈ చీడ ప్రాథమికంగా మట్టి, పొలంలో ఉపయోగించే పరికరాలు మరియు సాగునీరు కలుషితం కావడం వల్ల విస్తరిస్తుంది. చీడల బారిన సోకిన కలుపు, నీటిపారుదల మరియు సాగువిధానాలు అనేవి ఈ సంక్రామ్యతకు ద్వితీయ
వనరులుగా పేర్కొంటారు.
నియంత్రణ చర్యలు: మల్బరీలో వేరుకుళ్లు తెగులును నియంత్రించడానికి నవిన్య (హెర్బల్ 80% మరియు కెమికల్స్ 20%) ఉన్న సరికొత్త ఫార్ములాను ఉపయోగిస్తారు.
ఉపయోగించే విధానం: ఉపయోగించే విధానం: భూమి మీద నుంచి 15 నుంచి 30 సెంమీ ఎత్తులో ఎండిపోయిన చిగుళ్లను కత్తిరించండి. కాండం చుట్టూ ఒక గుంటను చేయండి మరియు 10గ్రాముల
నవిల్యాను 1 లీటరు నీటికి కలిపి చేసిన ద్రావణం(అంటే, 1 కిగ్రా నవిన్యలో 100 లీటర్ల నీరు, 100 మొక్కలకు సరిపోతుంది, అంటే 1లీటరు/1 మొక్క) పోయాలి. కత్తిరించిన కాండం మునిగేట్లుగా పోయండి. సూర్యకాంతికి
బహిర్గతం కాకుండా ఉండేందుకు మట్టితో కప్పండి. చీడ విస్తరించకుండా ఉండటం కొరకు పక్కనున్న మల్బరీ చెట్లకు కూడా ఈ విధంగా చేయండి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- శుద్ధి చేసిన మల్బరీ మొక్కలకు మొదటి నాలుగైదు రోజులపాటు నీటిని అందించవచ్చు.
- చనిపోయిన మల్బరీ చెట్లను తొలగించండి మరియు వాటిని కాల్చివేయండి, మట్టికి సూర్యకాంతి సోకేవిధంగా చూడండి.
- నాటడానికి 30నిమిషాల ముందు 0.2శాతం నవిన్యా ద్రావణంలో వేర్లను ముంచిన తరువాత కొత్త నారును నాటండి.
- కంపోస్ట్ మరియు ఎరువును వేయడం ద్వారా మట్టిలో సేంద్రియ పదార్థాల యొక్క మిశ్రమం 0.5శాతం కంటే ఎక్కువగా ఉండేవిధంగా చూడండి.
- వేసవి కాలంలో చీడ నుంచి కాపాడటం కొరకు మట్టిలో 50 నుంచి 60శాతం తేమ ఉండేవిధంగా తోటకు నీళ్లు పెట్టాలి.
3. చీడలు
1. పింక్ మిలే బగ్
సంభవించడం మరియు లక్షణాలు: పింక్ మిలే బగ్, మాకోన్లిలస్ కాకస్ హిర్‌సూట్రస్(ఆకుపచ్చ) అనేది మల్బరీలో వైకల్యాన్ని కలిగించడానికి కారణం అవుతాయి, ఈ తెగులను టుక్రా అని అంటారు.
ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులోనికి మారతాయి, రింగులు చుట్టుకొని, కణుపుల మధ్య దూరం తక్కువగా ఉండటం పలితంగా పైన గుబురుగా ఆకులు కనిపిస్తాయి.ఇది సంవత్సరం మొత్తం కూడా కనిపిస్తుంది, కానీ వేసవి నెలల్లో
ఎక్కువగా ఉంటుంది. మల్బరీ ఆకుల యొక్క దిగుబడి ఈ చీడ వల్ల సంవత్సరానికి, హెక్టారుకు 4,500 కిగ్రాల తగ్గిపోతుంది.
నియంత్రణ చర్యలు
యాంత్రిక నియంత్రణ:

కటింగ్ ఫ్లేయర్ ఉపయోగించి చీడ సోకిన చిగురును కత్తిరించండి. వాటిని ఒక పాలిథిన్ బ్యాగులో సేకరించండి మరియు వాటిని కాల్చడం ద్వారా ధ్వంసం చేయండి. చీడ మళ్లీ రాకుండా ఇది నిరోధిస్తుంది. పట్టుపురుగు 4వ దశకు
చేరుకునేటప్పుడు ఈ విధానాన్ని పాటించాలి.
రసాయనిక నియంత్రణ: కత్తిరించిన 15 నుంచి 20 రోజుల తరువాత లీటరు నీటికి 2.63 మిలీ చొప్పున 0.2% డిడివిపి 76%ని పిచికారీ చేయండి.
జీవ నియంత్రణ
వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే లేడీ బర్డ్ బీటెల్స్ క్రిప్టోలీమస్ మోనోట్రౌజరీ 250 వయోజన బీటెల్స్ లేదా సైమస్ కోకోవిరా 500వయోజన బీటెల్స్‌ను 6నెలలు విరామం ఉండేవిధంగా రెండు సమవిభజన చేసి చొప్పున విడుదల
చేయాలి.
దాడి జరిగే లేడీ బర్డ్ బీటెల్స్ ఇక్కడ లభ్యమవుతాయి:పెస్ట్ మేనేజ్‌మెంట్ ల్యాబ్, సిఎస్‌ఆర్ అండ్ టిఐ, మైసూరు(ఫోన్ నెంబరు: 0821: 2903285) ధర: ప్రతి యూనిట్‌కు రూ. 120
2. పపయ్యా మీలే బగ్

సంభవించడం మరియు లక్షణాలు: పపయ్యా మీలే అనేది ఒక కీటకం, దీని సాంకేతిక నామం పారాకోకస్ మార్జినటస్, ఇది ఇతర దేశాల నుంచి దిగుమతి అయిన కీటకం. ఇది బప్పాయి, జామ, టేకు, కూరగయాలు, జట్రోఫా
మరియు పార్థినియం, సిడా, అబ్యుటిలాన్ మొదలైన మొక్కలపై తన ప్రభావాన్ని చూపుతుంది. మల్బరీలో ఇది సోకిన ప్రాంతం సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ఆకు ఎదుగుదల ఆగిపోవడం, ఎరుపు/నల్లటి చీమలు చూడటం, తేనె
చుక్కల స్రావం, బూడిద బూజు ఏర్పడటం మరియు మొత్తం మీద మొక్క మరణించడం జరుగుతాయి. ప్రస్తుతం పపయ్యా మీలే కీటకం అరుదుగా కనిపిస్తోంది.
పపయ్యా మీలేబగ్ యొక్క సంప్రదాయ జీవ నియంత్రణ
- 1 ఎకరానికి 2 వైయల్ చొప్పున అన్యదేశ పారసిటాయిడ్ అయిన ఏరోఫాగస్‌ను విడుదల చేయండి.(1 వైల్+ 100 వయోజన పారసిటాయిడ్‌లు ఉంటాయి.)
- మమ్మీఫైడ్ మీల్‌బగ్‌లున్న ఇతర ఆతిధ్య
మొక్కలు అయిన పార్థీనియం, సిడ్డా, అబ్యూటలాన్, జట్రోఫా మొదలైన వాటిని తొలగించడం లేదా నాశనం చేయడం చేయవద్దు.
- దీని నియంత్రణ కొరకు ఎలాంటి క్రిమిసంహారిణులను పిచికారీ చేయవద్దు, ఆ విధంగా చేయడం వల్ల పరిస్తితి మరింత క్షీణిస్తుంది.

గమనిక: బాహ్య పారసిటాయిడ్‌లు నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్లీ ఇంప్టోర్టెడ్ ఇన్‌సెక్ట్స్ (ఎన్‌బిఎఐఐ), ఐసిఎఆర్, బెంగళూరు( సిబిఐకి ఎదురు, గంగా నగర్, బెంగళూరు, ఫోన్ నెంబరు: 080 `
23511982/98)
3.మల్బరీ లీఫ్ రోలర్

సంభవించడం మరియు రోగలక్షణం:ఆకులు చుట్టుకుపోవడం, డిపానియా పర్వెంటిలెంటాలిస్ అనేది మల్బరీలో రుతుపవన కాలంలో ప్రారంభం అవుతుంది.ఇది జూన్ నుంచి ఫిబ్రవరి వరకు ఉంటుంది.
అయితే ఇది సెప్టెంబర్ నుంచి అక్టోబర్ నెలల్లో గరిష్టంగా ఉంటుంది. లార్వా మల్బరీ ఆకులను సన్నటి పట్టుదారాలతో బంధిస్తుంది, లోపల ఉండి, ఆహారాన్ని తీసుకుంటుంది.దీని యొక్క మలపదార్థాలు సంక్రామ్య ప్రాంతానికి దిగువన
చూడవచ్చు.
నియంత్రణ చర్యలు:
యాంత్రిక నియంత్రణ: సంక్రామ్య ప్రాంతాన్ని(లార్వాతో కలిపి) కటింగ్ ఫ్లేయర్ ఉపయోగించి తొలగించండి, వీటిని ఒక పాలిథిన్ బ్యాగులో సేకరించండి మరియు వాటిని కాల్చడం ద్వారా ధ్వంసం
చేయండి.
రసాయనిక నియంత్రణ:
- కోత జరిగిన 12 నుంచి 15రోజుల తరువాత 0.076% డిడివిపి( 1మిలీ/1 లీటరు నీరు)ని పిచికారీ చేయండి.సురక్షిత కాలం: 7 రోజులు.
- 2.మొదటి పిచికారీ తరువాత 10 రోజులకు లీటరు నీటిలో 5 మిలీ 0.5% కమర్షియల్ నీమ్ పెస్టిసైడ్( 0.03% అజార్డికాంతం)ని ద్వితీయ పిచికారీ చేయండి. సురక్షిత కాలం: 10 రోజులు.
జీవ నియంత్రణ: ట్రైకోగామా క్లినోసిస్ ఎగ్ పారసిటాయిడ్‌ను 1 ట్రెంచో కార్డు/వారానికి చొప్పున (నాలుగు వారాలకు)విడుదల చేయండి. ట్రైకోగామా పారసిటాయిడ్ విడుదల చేసిన తరువాత ఎలాంటి
క్రిమిసంహారిణిని పిచికారీ చేయవద్దు.
(గమనిక: (గమనిక: ట్రెచోకార్డులు క్రిషి విజ్ఞాన కేంద్రం,సత్తూరు, నంజన్‌గుడ్ తాలూకా,మైసూరు జిల్లా లేదా పారసైట్ బ్రీడిరగ్ ల్యాబ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్(డిసి ఆఫీసు దగ్గర మాండ్యా) వద్ద ధర
ప్రాతిపదికన లభిస్తాయి.
4. బీహార్ హెయిరీ కాటర్‌పిల్లర్
సంభవించడం మరియు లక్షణాలు: బీహారీ హెయిరీ కాటర్ పిల్లర్, స్పిలార్సిటా, అబ్లికా అనేది మల్బరీ వర్షాకాలంలో ప్రారంభం అవుతుంది.ఇది సంవత్సరం పొడవునా సంభవిస్తుంది మరియు కొన్ని
పాకెట్లు అప్పుడప్పుడు కనిపిస్తాయి. యువ లార్వాలు ఆకు యొక్క అడుగుభాగాన ఒక వలలాంటి దాన్ని ఏర్పాటు చేసుకొని, ఆహారం తీసుకుంటున్నట్లుగా కనిపిస్తాయి. బాగా ఎదిగినవి ఎంతో క్రియాత్మకంగా ఉండి, పొలం మొత్తం
విస్తరించి, ఆకుల్ని విరివిగా తింటాయి..
నియంత్రణ చర్యలు
యాంత్రిక/భౌతిక చర్యలు: గుడ్ల ద్రవ్యరాశిని లేదా గ్రొగరియస్ యంగ్ కాటర్‌పిల్లర్లను సేకరించి, వాటిని 0.5శాతం సబ్బు ద్రావణం లేదా కాల్చడం ద్వారా ధ్వంసం చేయాలి.
రసాయనిక నియంత్రణ:
- కత్తిరించిన తరువాత లీటరు నీటికి 2మిలీ చొప్పున 0.15శాతం డిడివిపినిపిచికారీ చేయండి. సురక్షితా కాలం: 10 రోజులు
జీవ నియంత్రణ: ట్రైకోగామా క్లినోసిస్ ఎగ్ పారసిటాయిడ్‌ను 1 ట్రెంచో కార్డు/వారానికి చొప్పున (నాలుగు వారాలకు)విడుదల చేయండి. ట్రైకోగామా పారసిటాయిడ్ విడుదల చేసిన తరువాత ఎలాంటి
క్రిమిసంహారిణిని పిచికారీ చేయవద్దు.

5. రెక్కల పురుగులు
సంభవించడం మరియు లక్షణాలు: త్రిప్స్, రెక్కల పురుగులు సూడోడెండ్రోత్రిప్స్ మోరీ అనేది తమిళనాడులో ప్రధాన కీటకం అదేవిధంగ కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లో స్వల్పంగా కనిపిస్తుంది.ఇది
సంవత్సరం మొత్తం కనిపిస్తుంది అయితే వేసవి కాలం (ఫిబ్రవరి నుంచి ఏప్రిల్) వరకు తీవ్రంగా ఉంటుంది . ఎదిగిన పురుగులు మరియు డిరభకాలు, ఆకు కణాలపై జీవిస్తాయి మరియు ఆకులో ఉండే రసాన్ని పీలుస్తాయి. ఈ చీడ
సంక్రమించిన ఆకుల తొలిదశలో గీతలు కనిపిస్తాయి, తరువాత దశల్లో ఆకులు పసుపు/బూడిద రంగుల్లోకి మారడాన్ని గమనించవచ్చు.
నియంత్రణ చర్యలు:
యాంత్రిక/భౌతిక చర్యలు: రెక్కల పురుగుల జనాభాను మరియు మల్బరీ ఆకులకు దిగువ ఉన్న గుడ్లను చెదరగొట్టడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉపయోగించండి
రసాయనిక నియంత్రణ: కత్తరించిన 15రోజుల తరువాత 0.1% రోజర్‌ని 3మిలీ/1 లీటరు చొప్పున పిచికారీ చేయాలి. సురక్షిత కాలం: 20 రోజులు
జీవ నియంత్రణ: ప్రిడేటరీ లేడీ బర్డ్ బీటెల్స్‌ను విడుదల చేయలి( సైమస్ కొకావిరా 500/ ఎకరాకు)
6. తెల్ల దోమ

తెల్ల దోమ అనేది తెల్ల రంగులో ఉండటంతోపాటు, వాటిని కదిలించినప్పుడు ఎగిరే సామర్థ్యం ఉంటాయి కనుక వీటికి ఆ పేరు పెట్టారు. ఎదిగిన వాటికి ఒక జత రెక్కలుంటాయి, ఇవి తెల్లగా ఉంటాయి.ఇటీవల కాలంలో దక్షిణ భారత
రాష్ట్రం అయిన కేరళలో డయలియోరోఫోరా డిసెంఫంకా అనేది విస్తరించింది. ఇప్పుడు ఈ చీడ యొక్క తీవ్రత నీటిపారుదల బెల్ట్ అయిన కర్ణాటకలోని మైసూర్ మరియు మాండ్యా జిల్లాల్లో విస్తరించింది.
సంభించడం మరియు లక్షణాలు: ఆకులపై మైనం వంటి పదార్థం విస్తరించడం అనేది ఈ చీడ యొక్క ప్రధాన లక్షణం. దీర్ఘకాలం పొడిగా ఉండటం మరియు బాగా ఉక్కగా ఉండే వేడి వాతావరణం వల్ల
తెల్లరెక్కల దోమలు విస్తరిస్తాయి. ఇవి మార్చి నుంచి జూన్ అదేవిధంగా ఆక్టోబర్ నుంచి డిసెంబరు వరకు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకు నుంచి రసాన్ని పీల్చి, ఆకుని ధ్వంసం చేస్తాయి, తద్వారా ఇవి పట్టుపురుగుల పెంపకానికి పనికి
రాకుండా పోతాయి.
నియంత్రణ చర్యలు
యాంత్రిక/భౌతిక నియంత్రణ:
- తెల్లదోమ జనాభాను చెదరకొట్టడానికి స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఉపయోగించండి.
- పసుపు స్టిక్టీ ట్రాపులు అమర్చండి. ఎదిగిన తెల్లదోమను ట్రాప్ చేయడానికి ఎకరానికి 75 నుంచి 80ట్రాప్‌లను అమర్చండి.
రసాయనిక నియంత్రణ: కోసిన 12వ రోజు తరువాత 0.076% డిడివిపి( 1మిలీ/1లీటరు నీరు)ని పిచికారీ చేయండి. రెండో పిచికారీని 1.5మిలీ/1లీ 0.05% రోజర్ 30% ఈసిని పిచికారీ
చేయండి( సురక్షితా కాలం: 20 రోజులు)
జీవనియంత్రణ: వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే లేడీ బర్డ్ బీటెల్స్ క్రిప్టోలీమస్ మోనోట్రౌజరీ 250 వయోజన బీటెల్స్ లేదా సైమస్ కోకోవిరా 500వయోజన బీటెల్స్‌ను విడుదల చేయాలి.
ఆధారం:
సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, మైసూర్, కర్ణాటక