మల్బరీ పంట ఉత్పత్తి టెక్నాలజీ

మట్టి
- బంక మన్ను లేదా మట్టి నేలలు సిఫారసు చేయబడ్డాయి
- మట్టి యొక్క పిహెచ్ లేదా ఆమ్లత్వం 6.5 నుంచి 7.0 వరకు ఉండటం ఆదర్శవంతం.
- ఒకవేళ మట్టి యొక్క ఆమ్లత్వం( పిహెచ్ 7.0 కంటే తక్కువగా ఉన్నట్లయితే) సున్నాన్ని జోడించండి.
- ఒక్కవేళ మట్టి క్షారత్వాన్ని కలిగి ఉన్నట్లయితే (పిహెచ్ 7.0 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే) జిప్సం జోడించండి.
ఉష్ణోగ్రత
- నర్సరీ బెడ్ల యొక్క జాగ్రత్తలు మల్బరీ మొక్క పెరగడానికి 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత తగినది

వర్షపాతం
- 1000 నుంచి 1500మిమి వర్షపాతం అవసరం అవుతుంది
నర్సరీ పెంపకం:
- సీజన్: ప్రతి సంవత్సరం జూన్ – జులై నుంచి నవంబర్ – డిసెంబర్ వరకు.
- వెరైటీ: వి1 లేదా ఎస్36

కోత జాగ్రత్తలు:
- బాగా మెరకపై, సమచదరంగా ఉండి, గాలి, వెలుతురు బాగా ప్రసరించగలిన, బంకమన్ను లేదా జిగట మన్ను ఉన్న భూమిని ఎంచుకోండి.
- ఇరువైపులా రెండసార్లు లోతుగా దున్నండి.
- దున్నిన/త్రవ్విన 10 నుంచి 15రోజుల తరువాత మట్టిని తిరగవేయండి.
- 300*120 (పొడవు మరియు వెడల్పు) సెంమీ పరిమాణంలో ఉండే పాదును తయారు చేయండి.
- 25 నుంచి 30 సెంమీ వెడల్పు మరియుర 15 నుంచి 20 సెంమీ లోతు ఉండే బోద కాలవలను రూపొందించండి.
- ప్రతి పాదుపైన 20 కిగ్రాల ఎఫ్‌వైఎమ్‌ను చల్లండి.

కోతకు సిద్ధం చేయడం
- 8 నెలల వయస్సు ఉన్న కొమ్మల్ని నాటడానికి ఉపయోగించండి.
- 15 నుంచి 20 సెంమీ పొడవు మరియు 1. 15 సెంమీ వ్యాసం కలిగి 2నుంచి 4 మొగ్గలున్న కొమ్మల్ని కోతకు సిద్ధం చేయండి.
- ఈ కోసిన వాటిని తడి గోనెసంచిని కప్పి నీడలో ఉంచాలి.
- నాటడం వాయిదా వేసిన లేదా ఆలస్యం అయినా వాటిపై నీటిని చిలకరించండి.
నాటే టెక్నిక్‌లు
- వరసలు మధ్య 20 సెంమీ అదేవిధంగా అంట్ల మధ్య 8 సెంమీ ఖాళీ ఉండేవిధంగా చూడండి.
- ఒక మోడు ఉపయోగించి అంట్లను నాటడం కొరకు మట్టిలో రంధ్రాలు చేయండి.
- వంపుగా అంట్లను నాటండి
- అంటు చుట్టూ ఉండే మట్టిని బలంగా నొక్కండి.
- పొడి మల్బరీ కొమ్మలు, గడ్డి మొదలైన వాటితో దాని చుట్టూ కప్పండి.
- పొడి కాలాల్లో వారానికి ఒక్కసారి నర్సరీలోని మొక్కలకు నీటిని అందించండి.
మల్బరీ నర్సరీ నిర్వహణ
- పొడి కాలాల్లో వారానికి ఒక్కసారి నర్సరీలోని మొక్కలకు నీటిని అందించండి.
- నర్సరీలోని పాదుల్లో కలుపు రాకుండా చూసుకోండి

నర్సరీలో ఎరువుల వాడకం
- 55 నుంచి 60రోజులు ఎదిగిన తరువాత, ప్రతి పాదుకు 500గ్రాముల అమ్మోనియా సల్ఫేట్ లేదా నీటిలో కరిగిన 250గ్రాముల యూరియాను
మల్బరీ నర్సరీలో చీడలు మరియు కీటకాల యాజమాన్యం
- టిక్కా తెగులుకు వ్యతిరేకంగా 0.1శాతం డిడివిపిని పిచికారీ చేయండి.
- బూడిద తెగులు నివారించడం కొరకు 0.1శాతం బావిస్టన్‌ను పిచికారీ చేయండి.
నాటడం
- మూడు నుంచి నాలుగు నెలల తరువాత, నారు నాటడానికి సిద్ధంగా ఉంటుంది.
- నాటడానికి ముందు నర్సరీ పాదులకు సరిగ్గా నీటిని పెట్టండి.
- గొడ్డలి లేదా కత్తిని ఉపయోగించి నారును పెళ్లగించండి.
- స్వల్పకాలిక సంరక్షణ కొరకు వాటిపై నీటిని చిలకరించండి.
- ఎక్కువ సమయం రవాణా చేయాల్సి వస్తే వేర్లు ఎండిపోకుండా ఉండటం కొరకు నారును తడి గోనె సంచుల్లో ఉంచండి.
పొలంలో నాటడం
సీజన్: జూన్ నుంచి సెప్టెంబర్ వరకు (రుతుపవనకాలంలో)
భూమిని సిద్ధం చేయడం
- వర్షాకాల ప్రారంభంలో ట్రాక్టర్ లేదా పవర్ టిల్లర్ ఉపయోగించి 30 సెంమీ లోతుగా ఇరుదిక్కులా దున్నడం ద్వారా భూమిని సిద్ధం చేయండి.

మొక్కలు నాటడం కొరకు వరసల్ని సిద్ధం చేయడం
- జంట వరసలు (150 సెంమీ + 90 సెంమీ) మరియు వాటి మధ్య 60 సెంమీ ఎడం ఉండేవిధంగా సిఫారసు చేయబడిరది.
- ఈ విధంగా నాటడం ద్వారా ఒక హెక్టారు భూమిలో మనం మొత్తం 13,387 మొక్కల్ని నాటవచ్చు.
- ట్రాక్టర్/పవర్ టిల్టర్ వంటి యంత్రాలను పొలంలో ఉపయోగించడానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది.
- వర్షాకాలంలో నారును నాటండి మరియు నారు చుట్టూ ఉండే మట్టిని గట్టిగా నొక్కండి.
- నారు చుట్టూ ఉండే ప్రాంతాన్ని పొడి ఆకులు/గడ్డి/మల్బరీ కొమ్మలతో కప్పండి.
- నాటిని వెంటనే నారుకు నీరు పెట్టండి.
పంట యాజమాన్య విధానాలు
- కలుపు నివారణ మరియు ఏరేషన్ కొరకు నాటిన ఒక నెల తరువాత తేలికగా భూమిని దున్నండి.
- నెల అంతరాయంతో మరో రెండుసార్లు కలుపు నివారుణులు చల్లడంతోపాటు తేలికగా దున్నండి.
- ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మొక్కలకు నీరు పెట్టండి
- ప్రతి సంవత్సరం హెక్టార్‌కు 25 మెట్రిక్ టన్నుల ఎఫ్‌వైఎమ్‌ను వాడండి.
- రెండోసంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం హెక్టారుకు 350: 140: 140 చొప్పున ఎన్‌పికెను జల్లండి.
- వి1 లేదా ఎస్36 వెరైటీల నుంచి సంవత్సరానికి ఐదుపంటలు తీసుకోవచ్చు.
టెక్నాలజీ పేరు: “ ‘ పోషన్’ మల్బరీలో పోషకాల లోపాన్ని నియంత్రించడానికి ఒక బహుళ పోషక ఫార్ములా:
సిఫారసు చేయబడ్డ సంవత్సరం: 21.11.2011
ఈ టెక్నాలజీ యొక్క ముఖ్యాంశాలు
- మల్బరీ పంటలో చోటుచేసుకునే పోషకాల లోపాల్ని సరిచేసేందుకు సంతులిక పోషకాలతోపాటుగా ఎదుగుదల వృద్ధి కారకాలతో కూడిన
- మట్టితో వాడే దానితో పోలిస్తే వేగంగా ఉపయోగించడానికి మరియు వేగంగా రికవరీ కావడానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.
- మల్బరీ ఆకు నాణ్యతను పెంపొందిస్తుంది. ( మొత్తం ప్రోటీన్లు ా 45.93శాతం, మొత్తం చక్కెరలు : 46.34శాతం మరియు ఆకు తేమ
- మంచి తోటల్లో సైతం ఆకు నాణ్యతను మరియు దిగుబడిని 15 నుంచి 20శాతానికి వృద్ధి చెందిస్తుంది.
- ఇక ఈ సాంకేతికతను రైతు ఎంతో చక్కగా ఉపయోగించవచ్చు, ఎందుకంటే. ఆకు యొక్క నాణ్యతను వృద్ధి చెందించడానికి పంటకు ఒక పిచికారీ మాత్రమే సిఫారసు చేయబడుతోంది, ఇది పంట ఖర్చును కూడా తగ్గిస్తుంది.
- పోషన్ వాడకం వల్ల సి: బి నిష్పత్తి 1:7.00

ఉపయోగించే విధానం
- 1 లీటర్ పోషన్‌ను 140 లీటర్ల నీటిలో కలపండి మరియు ఒక ఎకరం మల్బరీ తోటలో పిచికారీ చేయండి( లీటరుకు 7మి.లీ)
- ఆకు కోసిన 25 నుంచి 30 రోజుల తరువాత ఉదయం 8 నుంచి 11గంటల మధ్య మల్బరీ ఆకులపై పిచికారీ చేయాలి..
ప్రతి లీటర్ పోషన్ యొక్క ఖరీదు: రూ. 150
ఆధారం:
సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, మైసూర్, కర్ణాటక