మల్బరీ పట్టుపురుగుల్లో చీడలు మరియు వ్యాధులు:బాంబాక్సీ మోరీ ఎల్.
1. చీడలు
1.గ్రాసరీ
కారణ కారకం: బాంబాక్సీ మోరీ న్యూక్లియర్ పోలీహైడ్రోసిస్ వైరస్
సంభవించేది: ఈ చీడ సంవత్సరం మొత్తం వ్యాపించడానికి అవకాశం ఉంది, కానీ దీని యొక్క తీవ్రతను వేసవి మరియు వర్షాకాలాల్లో ఎక్కువగా ఉంటుంది.

సంక్రామ్యత వనరులు: కలుషితమైన మల్బరీ ఆకుల్ని ఆహారంగా అందించబడ్డ పట్టుపురుగులకు ఇదిసంక్రమిస్తుంది. గ్రాసరీ లార్వా ద్వారా తెల్లని పాలవంటి ద్రవం విడుదల చేయబడుతుంది.
కలుషితమైన పెంపక గృహం మరియు అందులో ఉండే పరికరాలు సంక్రామ్యతకు వనరులుగా నిలుస్తాయి
ముందస్తు కారణాలు: గరిష్ట ఉష్ణోగ్రత, తక్కువ తేమమరియు మల్బరీ ఆకుల యొక్క నాణ్యత సరిగ్గా లేకపోవడం
లక్షణాలు:
- ఈ చీడ సోకిన లార్వా చర్మం పొలుసుల్ని విడిచిపెట్టడానికి ముందు ప్రకాశిస్తుంది మరియు లార్వా పొలుసుల్ని విడిచిపెట్టలేకపోతుంది.
- అంతర ఖండితాల వాపు కనిపిస్తుంది మరియు శరీరం పసుపురంగులోనికి మారుతుంది.
- చీడ సోకిన లార్వా అవిశ్రాంతంగా పెంపకం బెడ్/ ట్రేల యొక్క అంచుల వెంబడే తిరుగుతూ ఉంటుంది.
- చీడ సోకిన లార్వా యొక్క శరీరం తేలికగా పగిలిపోతుంది మరియు తెల్లగా ఉండే హీమోలింఫ్ బయటకు వస్తుంది.
యాజమాన్యం
- పెంపకం గృహాలను, వాటి పరిసరాలను సిఫారసుచేసిన నిర్జలీకరణలతో క్షుణ్నంగా నిర్జలీకరణ చేసేవిధంగా చూసుకోవాలి.
- గత పంట సమయంలో ఎక్కువ వ్యాధిగ్రస్థ ఘటనలు చోటుచేసుకున్నట్లయితే 0.3శాతం మెత్తని సున్నపు ద్రావణంలో నిర్జలీకరణను నిర్వహించండి.
- వ్యక్తిగతంగాను మరియు పెంపకం గదిలో పరిశుభ్రతను పాటించండి.
- రోగగ్రస్థ లార్వాలను సేకరించి, వాటిని సరిగ్గా పారవేయాలి.
- పెంపకం గృహంలో తగిన ఉష్ణోగ్రత మరియు తేమ ఉండేవిధంగా చూసుకోవాలి.
- నాణ్యమైన మల్బరీ ఆకుల్ని ఆహారంగా అందించండి మరియు రద్దీని పరిహరించండి
- షెడ్యూల్‌కు అనుగుణంగాను నిర్ధిష్ట బెడ్ నిర్జలీకరణిని వాడాలి.
- గ్రాసరీ చీడను నిరోధించడానికి షెడ్యూలుకు అనుగుణంగా అమృత్‌ను అందించండి.

2.ఫ్లెచరీ
కారణ కారకం: బాంబాక్సీ మోరీ ఫ్లెచరీ వైరస్/బాంబాక్సి మోరీ డెన్సోన్యూక్లియస్ వైరస్ లేదా స్ట్రెప్టోకోకస్ స్టెప్/స్టెఫానోకోలస్ స్టెప్/బాసిల్లస్ తురింజినిస్/సెర్రాటా మార్సెన్సెస్ వంటి బాక్టీరియాలు లేదా
బాక్టీరియాలు మరియు వైరస్‌ల యొక్క కలయిక వల్ల ఇది సంక్రమించవచ్చు.
సంభవించడం: ఈ చీడ సాధారణంగా వేసవి మరియు వర్షాకాలాల్లో ఎక్కువగా ఉంటుంది.
సంక్రామ్యతకు వనరు: కలుషితమైన మల్బరీ ఆకుల్ని తినడం వల్ల పట్టుపురుగులకు ఇది సంక్రమిస్తుంది. మరణించిన పట్టుపరుగులు, వాటి మలమూత్ర పదార్థాలు, ఆంత్ర రసం, శరీర ద్రవాలు
వంటివి సూక్ష్మజీవుల కలుషితానికి కారణం. గాయాలు/తెగడం/దెబ్బల వల్ల కూడా సంక్రామ్యత చోటు చేసుకుంటుంది.
ముందస్తు కారణాలు:ఉష్ణోగ్రతలు వ్యత్యాసాలు, గరిష్ట తేమ మరియు ఆకుల యొక్క నాణ్యత సరిగ్గా లేకపోవడం
లక్షణాలు:
- లార్వా మృదువుగా మరియు మెత్తగా మారుతుంది.
- లార్వా య్కొ ఎదుగుదల తగ్గిపోతుంది, నిష్రియాత్మకంగా మారుతుంది మరియు ఆంత్రరసాన్ని వాంతి చేసుకుంటూ ఉంటుంది. మలం మృదువుగాను మరియు గరిష్ట తేమశాతాన్ని కలిగి ఉంటుంది. కొన్నిసార్లు చైయిన్
తరహాలోనూ విసర్జన అదేవిధంగా మలాశయం చొచ్చుకురావడం వంటివి కూడా చూడవచ్చు.
- లార్వా తల మరియు మొండెం అపారదర్శకంగా మారుతుంది.
- బాసిల్లస్ తురింగినెస్ సోకినప్పుడు పక్షవాతం మరియు హటాత్తుగా మరణించడం వంటి విషలక్షణాలను గమనించవచ్చు. మరణించిన తరువాత లార్వా నల్లగా మారుతుంది మరియ దుర్గంధాన్ని వెదజల్లుతుంది.
- కొన్నిసార్లు సెరాటియా ఎస్‌పితో మరణించిన లార్వా ఎరుపు రంగులోనికి మారుతుంది.
యాజమాన్యం:
- పెంపకం గృహాలను, వాటి పరిసరాలను పైన సిఫారసుచేసిన నిర్జలీకరణలతో క్షుణ్నంగా నిర్జలీకరణ చేసేవిధంగా చూసుకోవాలి.
- వ్యాధిగ్రస్థ లార్వాను ఏరండి మరియు వాటిని కాల్చడం ద్వారా డిస్పోజ్ చేయండి.
- మంచి సూర్యకాంతి మరియు సిఫారసు చేయబడ్డ యాజమాన్య పద్ధతుల్లో పండిరచిన మంచి నాణ్యమైన ఆకుల్ని ఇవ్వండి. ఎక్కువగా పండిన/ ఎక్కువగా నిల్వ చేసిన/ ఎండిపోయిన ఆకుల్ని పట్టుపురుగులకు
ఇవ్వకండి.
- పట్టుపురుగులు ఆకలికి గురికావడం, సమూహం ఎక్కువగా ఉండటం మరియు పెంపకం బెడ్‌పై మలమూత్రాలు పోగుకాకుండా చూసుకోవాలి.
- పట్టుపురుగులను తగిన ఉష్ణోగ్రత మరియు తేమలో ఉంచాలి.
- లార్వాకు గాయం కాకుండా చూడాలి
- షెడ్యూల్‌కు అనుగుణంగాను నిర్ధిష్ట బెడ్ నిర్జలీకరణిని వాడాలి.
- ఫ్లెచరీ చీడను నిరోధించడానికి షెడ్యూలుకు అనుగుణంగా అమృత్‌ను అందించండి.
3. మస్కార్డిన్
కారణ కారకం: ఫంగస్ వ్యాధులతోపాటుగా, తెల్ల మస్కార్డిన్ అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది.ఈ చీడ బియావెరియా బాసియానా అనేదాని ద్వారా సంక్రమిస్తుంది.
సంభవించడం: ఈ వ్యాధి వర్షాకాలం మరియు శీతాకాలంలో ఎక్కువగా సంభవించడానికి అవకాశం ఉంది.
సంక్రామ్యత కారకాలు:: కొనీడియా పట్టుపురుగు శరీరాన్ని తాకినప్పుడు సంక్రామ్యత ప్రారంభం అవుతుంది.మమ్మీఫైడ్ పట్టుపురుగులు/ప్రత్యామ్నాయ అతిధులు( ఎక్కువగా లెపిడో పెట్రాన్ చీడలు),కలుషితమైన
పెంపక గృహాలు మరియు అనువర్తనాలు సంక్రామ్యతకు వనరులు.
ముందుస్తు కారకాలు: తక్కువ ఉష్ణోగ్రతతో ఎక్కువ తేమ

రోగలక్షణాలు:
- లార్వా ఆకలిని కోల్పోతుంది మరియు నిష్రియాత్మకంగా మారుతుంది.
- చర్మంపై తడిగా ఉన్న పొలుసులు కనిపిస్తాయి.
- లార్వా వాంతులు చేసుకొని,వదులుగా మారుతుంది.
- మరణించిన తరువాత లార్వా నెమ్మదిగా గట్టిగా మారుతుంది. శరీరంపై మైసీలియా మరియు కొనిడియా యొక్క ఎదుగుదల వల్ల మమ్మీఫికేషన్ అవుతుంది మరియు శరీరం తెల్లని తెలుపుగా మారుతుంది.
యాజమాన్యం:
- పెంపకగృహం, దాని పరిసరాలు మరియు పరికరాలను పైన పేర్కొన్నవిధంగా సిఫారసు చేయబడ్డ నిర్జలీకరణితో నిర్జలీకరణ చేయాలి..
- మల్బరీ తోటలో మల్బరీ క్రిములను నియంత్రించాలి.
- మమ్మీఫికేషన్ కావడానికి ముందు వ్యాధిగ్రస్థ లార్వాను ఏరాలి మరియు వాటిని కాల్చివేయాలి.
- పెంపకం గదిలో తక్కువ ఉష్ణోగ్రతలు మరియు ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలి.ఒకవేళ అవసరం అయితే ఉష్ణోగ్రతను పెంచడానికి హీటర్/స్టవ్‌ను ఉపయోగించండి.
- చర్మం విడిచి దశలో మరిముఖ్యంగా వర్షాకాలంలో సున్నాన్ని చల్లడం ద్వారా బెడ్‌లోని తేమను నియంత్రించండి.
- విజేత మరియు విజేత సప్లిమెంట్/అంకుష్/ ఏదైనా సిఫారసు చేయబడ్డ బెడ్ నిర్జలీకరణిని షెడ్యూల్ మరియు పరిమాణానికి అనుగుణంగా బెడ్ నిర్జలీకరణిని ఉపయోగించండి.
4. పెబ్రైన్:
కారణ కారకం: నోసిమా బాంబియోసిస్/మైక్రోస్పోరాడియా యొక్క విభిన్న రకాలు.
సంభవించడం : ఎలాంటి సీజన్ లేదు
సంక్రామ్యతకు వనరులు: గుడ్లు( ట్రాన్సోవేరియన్/ట్రాన్సోవం ట్రాన్స్‌మిషన్) లేదా కలుషితమైన మల్బరీఆకులు తినడం ద్వారా పట్టుపురుగులకు ఇది సంక్రమిస్తుంది. సంక్రామ్య పట్టుపురుగులు,
మలమూత్రాలు, కలుషితమైన పెంపకగృహం మరియు పరికరాలు మరియు ప్రత్యామ్యాయ అతిధులు(మల్బరీ కీటకాలు) అనేవి సంక్రామ్యతకు వనరులు.

లక్షణాలు:
- పట్టుపురుగుల గుడ్ల అపక్రమంగా పొదగడం
- Iలార్వా బాడీ మరియు పట్టుపరుగుల యొక్క పరిమాణం సరిగ్గా లేకపోవడం
- చీడ సోకిన లార్వా ఆకలిని కోల్పోతుంది మరియు ముడతలతో కూడిన చర్మంతో నిష్రియాత్మకంగా ఉంటుంది.
- నల్లని మిరియాలు వంటి మచ్చలు సంక్రామ్య పురుగుల శరరీంపై మచ్చలు ఏర్పడతాయి.
- సూక్ష్మదర్శిని కింద పరిశీలించినప్పుడు, పట్టుగ్రంధులపై తెల్లని మచ్చలు ఉండటాన్ని చూడవచ్చు.
యాజమాన్యం:
- పెంపకగృహం, దాని పరిసరాలు మరియు పరికరాలను పైన పేర్కొన్నవిధంగా సిఫారసు చేయబడ్డ నిర్జలీకరణితో నిర్జలీకరణ చేయాలి.
- తల్లి పట్టుపురుగుల పరీక్ష క్షుణ్నంగా నర్విహించాలి, అదేవిధంగా పట్టుపురుగుల గుడ్ల ఉపరితలాలు నిర్జలీకరణ చేయాలి, తద్వారా ఇవి ఎలాంటి చీడలు లేకుండా పొదుగుతాయి.
- పెంపకం సమయంలో కచ్చితమైన పరిశుభ్రత విధానాలను పాటించాలి.
- మల్బరీ తోట చుట్టుపక్కల ఉండే చీడల్ని నియంత్రించాలి.
- షెడ్యూల్ మరియు పరిమాణానికి అనుగుణంగా విజేత/అంకుష్ వంటి బెడ్ నిర్జలీకరణిని ఉపయోగించండి.
- మైక్రోస్పోరాడియన్ సంక్రామ్యతలను తొలగించడానికివిత్తన పంటల్ని నిరంతరం పర్యవేక్షించండి
పెంపక గృహం మరియు దాని యొక్క పరిసరాల ప్రాంతాలను మరియు పరికరాలను నిర్జలీకరణం చేయండి:
నిర్జలీకరణ కొరకు సిఫారసు చేయబడ్డ నిర్జలీకరణను ఎంచుకోండి. సిఎస్‌ఆర్ మరియు టిఐ, ఈ దిగువ నిర్జలీకరణులను సిఫారసు చేస్తుంది.
- 0.05శాతం అస్త్ర ద్రావణం( 100 లీటర్ల నీటిలో 50గ్రాముల ఆస్త్ర పొడిని చేర్చండి మరియు బాగా కలపండి మరియు పొడి కరగడం కొరకు రెండుగంటల పాటు ఉంచండి)
- 0.5శాతంమెత్తని సున్నపు ద్రావణంలో 2.5శాతం శానిటెక్/సెరిక్లోర్(100లీటర్ల ద్రావణాన్ని తయారుచేయడానికి, 250గ్రాముల యాక్టివేటరును ఒక బేసిన్ లేదా బక్కెట్లో తీసుకోండి మరియు 2.5లీటర్ల శానిటెక్/సెరిక్లోర్
ద్రావణాన్ని కలపండి. దీనిని 10 నిమిషాలపాటు ఉంచండి.మిగిలిన నీటికి యాక్టివేటెడ్ ద్రావణాన్ని కలపండి.ఈ ద్రావణానికి, 500గ్రాముల మెత్తని సున్నపు పొడిని జోడించండి మరియు బాగా కలియదిప్పండి).
- 0.3శాతం మెత్తని సున్నపు ద్రావణంలో 2శాతం బ్లీచింగ్ పౌడర్(100లీటర్ల ద్రావణం తయారుచేయడానికి, 2కిగ్రా బ్లీచింగ్ పౌడరుకు కాస్తంత నీరును మరియు 300గ్రాముల మెత్తని సున్నపు పొడిని కలిపి పేస్టుగా చేయాలి.ఈ
పేస్టును మిగిలిన నీటికి జోడిరచాలి మరియు బాగా కలియదిప్పాలి. 10నిమిషాలపాటు ఉంచండి మరియు పైకి తేలిన దానిని ఉపయోగించండి)
- 0.3శాతం మెత్తని సున్నపు ద్రావణం(గత పంటలో వైరస్ తెగులు కనిపించినట్లయితే ఐచ్ఛికంగా ఈ నిర్జలీకరణ చేయవచ్చు. 300గ్రాముల మెత్తని సున్నాన్ని 100లీటర్ల నీటిలో వేసి, బాగా కలపాలి. 10 నిమిషాలపాటు
కదలకుండా ఉంచి, పైన తేలేదానిని ఉపయోగించాలి.)
- పెంపక గృహం యొక్క ఫ్లోర్ ఏరియాను బట్టి నిర్జలీకరణకు ఎంత పరిమాణంలో నిర్జలీకరణి అవసరం అవుతుందనే విషయాన్ని అంచనా వేయవచ్చు( ఫ్లోర్ యొక్క పొడవు వెడల్పు)
- ఒక చదరపు మీటరుకు 1.5లీటర్లు లేదా ప్రతి చదరపు అడుగుకు 140మిలీ నిర్జలీకరణ ద్రావణం అవసరం అవుతుంది.పెంపకగృహం( ఎత్తు 3 మీటర్లు/10 అడుగులు) యొక్క ఫ్లోర్ ఏరియా + నిర్జలీకరణ ద్రావణంలో మొత్తం
10శాతం
- పవర్ స్ప్రేయర్ ఉపయోగించి పెంపకం గృహం, పరికరాలు మరియ పరిసరాల్లో పిచకారీ చేయడం ద్వారా నిర్జలీకరణ చేయవచ్చు. ప్రతి పంటకు రెండుసార్లు నిర్జలీకరరణ చేయాలని సిఫారసు చేయబడుతోంది.( పెంపకం ప్రారంభం
కావడానికి ముందు మరియు పెంపకం పూరయిన వెంటనే 3రోజుల్లోగా ఇది చేయాలి)
II. చీడలు
1. కందిరీగలు
|
కందిరీగలు
|
యుజి ఫై యొక్క గుడ్లు
|
నల్లని మచ్చు
|
పట్టుకాయలకు నష్టం
|
సంభవించడం మరియు రోగలక్షణాలు
యుజిఫ్లై, ఎక్స్‌ట్రాషియా బాంబేసిస్ అనేది పట్టుపురుగుల్లో ఒక తీవ్రమైన ఎండోలార్వల్ పారసిటాయిడ్. పట్టు పెంచే ప్రధాన రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు వంటి రాష్ట్రాల్లో దీని వల్ల 10 నుంచి 15శాతం
పట్టుకాయల పంట దిగుబడి నాశనం అవుతోంది.
ఈ కీటకం సంవత్సరం మొత్తం కాలంలో ఆశిస్తుంది, కానీ వర్షాకాలంలో తీవ్రంగా ఉంటుంది. పట్టుపురుగు శరీరంపై గుడ్లు లేదా నల్లని చారలు అదేవిధంగా మాగ్గెట్ ఉద్భవిజం, పట్టుకాయ యొక్క పైన రంధ్రం ఏర్పడటం వంటివి ఈ
కీటకం యొక్క దాడికి సాధారణ కారణాలుగా చెప్పవచ్చు.
కందిరీగలు పెంపకం గృహంలోనికి వచ్చిన వెంటనే, ప్రతి పట్టుపురుగు లార్వాపై అది ఒకట్రెండు గుడ్లను పెడుతుంది. 2 నుంచి 3 రోజులు గడిచిన తరువాత, గుడ్లు పొదగబడతాయి మరియు ఇవి లార్వాలోపలికి ప్రవేశిస్తాయి. ఇవి
5 నుంచి 7 రోజుల పాటు లార్వాలోపల ఉన్న ఆహారపదార్థాలను తిని జీవిస్తాయి. ఆ తరువాత లార్వాను బద్దలు చేసుకొని ఇవి బయటకు వస్తాయి.
నియంత్రణ చర్యలు
రాకుండా చూసే చర్యలు
- అన్ని కిటికీలు మరియు తలుపుకు వైర్ మెష్/నెలాన్ తెరలను అమర్చాలి.
- ఆటోమేటిక్ మూసుకొనే విధానాన్ని తలుపులకు అమర్చాలి.
- పెంపక గృహం యొక్క ప్రవేశంలో ప్రవేశ గదిని ఏర్పాటు చేయాలి.
- ఆకుల్ని వరండాలో ఉంచి, పెంపకం గదిలోని మార్చడానికి ముందు, ఈ కీటకాలు ఉన్నాయా అని గమనించాలి.
భౌతికం(యూజి ట్రాప్ ఉపయోగించడం)
1 మాత్రను ఒక లీటరు నీటిలో కరిగించాలి మరియు మూడో దశ నుంచి స్పిన్నింగ్ దశ వరకు ఈ ద్రావణాన్ని తెల్లని ట్రేలో పోసి పెంపకం గృహం యొక్క కిటికీ ముందు వైపు మరియు వెనకవైపున ఉంచాలి.
లోపల ఉండే కీటకాలను పట్టుకోవడం కోసం కనీసం20రోజులపాటు పెంపక గృహం/ మౌంటింగ్ హాల్ లోపల ఈ కీటకాల తెరల్ని ఉపయోగించాలి.

బయోలాజికల్
- 5వ దశ యొక్క రెండో రోజున పెంపకగృహం లోపల నెసిలాక్స్ థైమస్( యుజి కీటకం యొక్క పారసిటాయిడ్ ప్యూపా) విడుదల అవుతుంది.
- అన్ని స్పిన్నింగ్ పురుగులను చండ్రికాలకు దగ్గరల్లో ఉన్న సంచుల్ని మార్చిన తరువాత
- పట్టుగూళ్లను తీసిన తరువాత ఈ సంచుల్ని ఎరువుల గుంటకు దగ్గరగా ఉంచండి.
- 100 డిఎఫ్‌ఎల్‌ఎస్ కొరకు రెండు సంచులు అవసరం అవుతాయి.

పట్టుకాయల్ని తీసిన తరువాత, పుట్టుపురుగుల యొక్క మలమూత్రాలను సరిగ్గా పారవేయడం
- మల్బరీ కొమ్మల నుంచి పట్టుపురుగుల యొక్క మలమూత్రాలను వేరే చేయండి
- పట్టుపురుగుల యొక్క మలమూత్రాలను బహిరంగంగా పడవేయకూడదు,ఎందుకంటే దీనిలో వందల కొలదీ సూక్ష్మజీవులుంటాయి.
- మలమూత్రాల నుంచి యూజీ కీటకాలు పుట్టకుండా ఉండటం కోసం వీటిని 15 నుంచి 20రోజుల పాటు ఒక ప్లాస్టిక్ సంచికలో ఉంచవచ్చు. ప్రత్యామ్నాయంగా, మట్టిలో పూడ్చివేయవచ్చు లేదా తక్షణం కాల్చివేయవచ్చు.
నెసిలాక్స్ థైమస్ యొక్క లభ్యత
పెస్ట్ మేనేజ్‌మెంట్ ల్యాబ్స్, సిఎస్‌ఆర్‌టిఐ,మైసూర్ వారి నుంచి లభ్యత.బ్రషింగ్ రోజున పట్టుపురుగుల యొక్క బ్రషింగ్ తేదీ మరియు అవసరమైన సంచులను తెలియజేస్తూ ఇండెంట్ పెట్టాలి. ప్రతి సంచికి 25రూపాయల అడ్వాన్స్
పేమెంట్ అందుకున్న తరువాత కొరియర్ ద్వారా సంచులు పంపబడతాయి.
2. డెర్మిస్టిడ్ బీటిల్స్
సంభవం మరియు లక్షణాలు
డెర్మిస్టిడ్ బీటిల్స్, డెర్మిస్టిస్ వోటెర్ అనేవి పట్టుకాయల్ని నిల్వ చేసే గదుల్లో నిల్వచేసిన పట్టుకాయలపై దాడిచేస్తాయి. ఆడ బీటెల్స్ పట్టుకాయలపై 150 నుంచి 250 గుడ్లను పెడతాయి. పట్టుకాయల్ని నిల్వ చేసే గది నుంచి
బీటెల్స్ గ్రేనేజీ మరియు ఆకుపచ్చ పట్టుకాయలపైనా పట్టుపురుగులపైనా దాడి చేస్తాయి. పట్టుకాయల్లో వీటి నష్టం 16.62శాతంగాను మరియు పట్టుపురుగుల్లో 3.45శాతంగాను ఉంటాయి.
డెర్మిస్టిడ్ బీటెల్స్ యొక్క యాజమాన్యం:
నియంత్రణ చర్యలు
- తిరస్కరించిన పట్టుకాయల్ని మరియు కుళ్లిపోయిన గుడ్లను దీర్ఘకాలంపాటు నిల్వ చేయరాదు.
- పెంపకం గృహం, పట్టుకాయల్ని నిల్వ చేసే గదిని క్రమం తప్పకుండా శుభ్రం చేస్తుండాలి.
- పట్టుపురుగు పుట్టిన తరువాత మరియు ముందు గ్రైనేజీ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలి.
- కుట్టిన పట్టుకాయలు(పిసి)లు నిల్వ చేసే గదిలో గోడలు మరియు కిటీలకు వైర్ మెష్ ఏర్పాటు చేయాలి.
- నిల్వ గదిలో ఉండే చెక్క సామాను మరియు గ్రైనేజీని 2 నుంచి 3 నిమిషాలపాటు 0.2శాతం మలాథిన్ ద్రావణంలో ముంచాలి. ట్రేలు మొదలైన వాటిని తిరిగి ఉపయోగించడానికి 2 నుంచి 3రోజుల ముందు బాగా కడిగి ఎండలో
ఆరబెట్టాలి.
యాంత్రిక నియంత్రణ: వాక్యూం క్లీనర్ ఉపయోగించి లేదా ఊడ్చడం ద్వారా బాగా పెరిగిన లద్దెపురుగులను సేకరించాలి, సబ్బు నీటిలో ముంచడం లేదా కాల్చడం ద్వారా వాటిని ధ్వంసం
చేయాలి.
రసాయనిక నియంత్రణ:
- కుట్టిన పట్టుకాయల్ని డెల్టామిత్రిన్‌తో శుద్ధి చేసిన బ్యాగుల్లో అంటే 0.28శాతం డెల్టా మిత్రిన్ ద్రావణంలో నానబెట్టి ( 1లీటరు: 100లీటర్ల నీరు)మరియు నీడలో ఆరబెట్టినవి.
- ప్రతి 3 నెలలకు ఒక్కసారి పిసి రూమ్ యొక్క నేల మరియు గోడలపై 0.028శాతం డెల్టా మెత్రిన్ ద్రావణాన్ని పిచికారీ చేయండి.
- లద్దె పురుగులు పిసి రూమ్ నుంచి పాక్కుంటూ రాకుండా నిరోధించడానికి పిసి రూమ్ యొక్క లోపలి గోడల చుట్టూ బ్లీచింగ్ పౌడర్(200గ్రాములు/చదరపు మీటరు)కు పిచికారీ చేయాలి.
ఆధారం:
సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, మైసూర్, కర్ణాటక



