మల్బరీ పట్టుపురుగుల పెంపకం

పెంపక గృహం ( 200నుంచి 250 డిఎఫ్‌ఎల్‌ఎస్‌ కొరకు)
  • 200-250 డిఎఫ్ఎల్ఎస్ కు ఆవాసం కల్పించడానికి 50 అడుగులు X 20 అడుగులు X 10 అడుగుల సైజు ఉండే పెంపక గృహాలను నిర్మించండి.
  • పెంపక గృహానికి చుట్టుపక్కల్లో 3 అడుగుల వరండాను ఏర్పాటు చేయాలి.
  • పెంపక గృహం లోపల చక్కగా గాలి వీచేలా ఉండటం కొరకు అవసరమైన సంఖ్యలో కిటికీలు మరియు వెంటిలేటర్లను అమర్చండి.
  • రెక్కల పురుగులు లోపలికి రాకుండా నిరోధించడంకొరకు, విండోలు మరియు వెంటిలేటర్లను నైలాన్‌ తెరతో కవర్‌ చేయాలి.
silks
సిఫారసు చేయబడ్డ హైబ్రిడ్‌ రకాలు
  • మల్టీవోలైన్‌: పిఎమ్‌ × సిఎస్‌ఆర్‌2, ఎల్‌12 × సిఎస్‌ఆర్‌2
  • బివోలైన్‌: సిఎస్‌ఆర్‌2 × సిఎస్‌ఆర్‌, ఎఫ్‌సి1 × ఎఫ్‌సి2 (డబుల్‌ హైబ్రిడ్‌)

పెంపక గృహం మరియు అందులో ఉపయోగించే పరికరాలను సిఫారసు చేయబడ్డ నిర్జలీకరణులను ఉపయోగించి నిర్జలీకరణం చేయాలి.

పెంపక గృహంలో ఉపయోగించే పరికరాలు

పవర్‌ స్ప్రెయర్‌, పెంపకం స్టాండ్స్‌, పెంపకం ట్రేలు, ఫోం ప్యాడ్‌లు, మైనం కోటింగ్‌ వేసిన పారఫిన్‌ కాగితాలు, నైలాన్‌ తెరలు, ఆకులు ఉంచడానికి బుట్టలు, గోనెసంచెలు, రోటరీ లేదా వెదురు మౌంటేజ్‌లు మరియు లేదా నెట్‌ట్రైక్‌లు

ఇన్యుబేషన్‌ మరియు బ్రషింగ్‌
  • పారఫిన్‌ కాగితంపై ఒక పొర గుడ్లను పరిచి, దాన్నిఒక ట్రేలో ఉంచండి.
  • గుడ్లను మరో పారఫిన్‌ కాగితంతో కప్పండి.
  • గది ఉష్ణోగ్రత 25 నుంచి 26డిగ్రీలు మరియు తేమ 80శాతం వరకు ఉండేవిధంగా చూడాలి.
  • నీలం రంగులో ఉండే పిన్‌ హెడ్‌ కనిపించేటప్పుడు,ఒక టిష్యూ పేపర్‌లో గుడ్లు( 25 నుంచి 50 డిఎఫ్‌ఎస్‌ఎల్‌ చొప్పున) చుట్టండి మరియు ఈ గుడ్లను 1 నుంచి 2 రోజులపాటు నల్లటి పేయింట్‌ వేయబడ్డ బాక్సులో లేదా నల్లని బట్ట లేదా కాగితం చుట్టి ఉంచండి.
  • తరువాత రోజు సూర్యకాంతి వెలుతురులో లేదా నీడలో గుడ్లను బహిర్గతం చేయండి.
silks
కొత్తగా పొదిగిన పురుగుల యొక్క బ్రషింగ్‌
  • కొత్తగా పొదిగిన పురుగులను జాగ్రత్తగా ఒక మృదువైన బ్రష్‌ లేదా ఈకను ఉపయోగించి పెంపకం ట్రేలో ఉంచిన పారఫిన్‌ కోటింగ్‌ పేపర్‌ మీదకు జాగ్రత్తగా బదిలీ చేయండి.
  • కొత్తగా పొదిగిన పురుగులను జాగ్రత్తగా ఒక మృదువైన బ్రష్‌ లేదా ఈకను ఉపయోగించి పెంపకం ట్రేలో ఉంచిన పారఫిన్‌ కోటింగ్‌ పేపర్‌ మీదకు జాగ్రత్తగా బదిలీ చేయండి.
silks
చాకీల పెంపకం
  • పురుగులను ట్రేలో ఏకరీతిగా పంపిణీ చేయండి.
  • పట్టుపురుగులకు పోషకాలు మరియు మంచి ఆకులను అందించండి.
  • మొదటి దశలో 0.5 నుంచి 2 సెంమీ వరకు కోసిన లేత ఆకుల్ని 3 నుంచి 4సార్లు అందించండి.
  • 1వ దశలో ప్రతి 100 డిఎఫ్‌ఎల్‌ఎస్‌ కొరకు 5 కిగ్రాలు మరియు 2వ దశలో ప్రతి 100డిఎఫ్‌ఎల్‌ఎస్‌ కొరకు 18కిగ్రాల ఆకుల్ని అందించాలి.
  • 2వ దశలో ఆకుల్ని 2 నుంచి 4 చదరపు సెంమీ పరిమాణంలో కోసి 3నుంచి 4సార్లు అందించాలి.
  • ఉష్ణోగ్రత 27 నుంచి 28 డిగ్రీలు మరియు తేమ 80 నుంచి 90డిగ్రీల సెల్షియస్‌ ఉండేవిధంగా చూడాలి.
  • ప్రతిరోజూ 2వసారి ఆహారాన్ని అందించడానికి ముందు, ఇంతకు ముందు ఇచ్చిన మేత ఆకులు ఎండిపోయేందుకు బెడ్‌ను విస్తరించండి.
  • 1వసారి మరియు 2వసారి రెక్కలు రాల్చే సమయంలోను మరియు ప్రతిరోజూ 3వ దశలోనూ 0.5 చదరపు సెంమీ మెష్‌ సైజు ఉన్న కాటన్‌ క్లీనింగ్‌ నెట్‌ ఉపయోగించి తప్పకుండా బెడ్‌ క్లీన్‌ కేయాలి.
  • రెక్కలు రాల్చడానికి ముందు బెడ్‌ యొక్క పరిమాణాన్ని తగ్గించండి.
  • 97శాతం పురుగులు రెక్కలు రాల్చడానికి సిద్ధమైనప్పుడు, ఆహారాన్ని అందించడాన్ని ఆపివేయండి మరియు పురుగులపై సున్నితంగా ఉండే సున్నాన్ని జల్లండి.
silks
తరువాత దశ పెంపకం
  • రెండోసారి రెక్కలు రాల్చిన తరువాత పట్టుపురుగులు, షూట్‌ ర్యాక్‌లకు బదిలీ చేయబడతాయి.
  • ఈ అరలు ఇనుము, కలప లేదా వెదురుతో తయారు చేయబడతాయి.
  • ఇది 3 అంచెలుగా ఉండటం ఉత్తమం
  • ప్రతి అర యొక్క వెడల్పు 5 అడుగులు మించకుండా ఉండాలి.
  • అడుగు అర భూమి మీద నుంచి 1 అడుగు ఎత్తులో ఉండాలి.
  • రెండు అరల మధ్య స్థలం కనీసం 2 అడుగులు ఉండాలి.
  • లార్వాకు అందించే చిగుర్లు 50 నుంచి 60 రోజులవై ఉండాలి.
  • రోజుకు 2 నుంచి 3సార్లు మేత అందించాలని సిఫారసు చేయబడుతోంది.
  • 5వ దశ యొక్క 4వరోజునాడు మాత్రమే బెడ్‌ క్లీనింగ్‌ చేయాలి.
  • అన్నివైపులా గాలివచ్చేవిధంగా చూడాలి.
  • బెడ్‌ల మధ్య సరైన స్థలాన్ని కల్పించండి( ప్రతి 10 డిఎఫ్‌ఎల్‌ఎస్‌లకు మధ్య 800 నుంచి 900 చదరపు అడుగులు) మరియు తగినంత ఆహారాన్ని అందించండి.
రెక్కలు రాల్చే సమయంలో సంరక్షణ
  • 90శాతం పురుగులు రెక్కలు రాల్చే దశకు చేరుకున్న తరువాత ఆహారాన్ని అందించడం ఆపివేయండి.
  • సరిగ్గా ఆరడం కొరకు మరియు ఏరేషన్‌ కొరకు బెడ్‌ను విస్తరించండి.

తేమ స్థాయి తక్కువగా ఉండేందుకు బెడ్‌మీద సున్నాన్ని జల్లండి.

మౌంటింగ్‌ మరియు హార్వెసింగ్‌
  • బాగా పక్వానికి వచ్చిన పురుగులను మౌంటింగ్‌ కొరకు ఏరండి.
  • రోటరీ, ప్లాసిక్‌ లేదా వెదురు మౌంటింగ్‌ల్లోనికి వీటిని మార్చండి.
  • ప్రతి చదరపు అడుగు ప్రాంతంలో 40 నుంచి 45 పురుగులు ఉంచండి.
  • చీడలున్న మరియు మరణించిన పురుగులను తొలగించండి.
  • ఉష్ణోగ్రత 27 నుంచి 28డిగ్రీల సెల్షియస్‌ ఉండేవిధంగాను మరియు తేమ 60 నుంచి 70శాతం ఉండేవిధంగా చూడండి.
  • అదనపు తేమను తొలగించడానికి ఎరేషన్‌ కల్పించండి.
  • బలమైన కాంతి పడకుండా చూడాలి.
  • మౌంటింగ్‌ చేసిన 5వ రోజు నుంచి పట్టుకాయల పంట తీయండి
  • సారహీనమైన, తడిసిన మరియు అపక్రమ పరిమాణంలో ఉండే పట్టుకాయల్ని తొలగించండి.
పెంపకం మరియు వ్యక్తిగత సంరక్షణ
  • పెంపకం గృహంలోనికి ప్రవేశించడానికి ముందు చేతుల్ని నిర్జలీకరణతో శుభ్రం చేసుకోవాలి.
  • పెంపకంలో నిమగ్నమైన వ్యక్తులు కాకుండా ఇతర వ్యక్తులు లోపలికి ప్రవేశించుకుండా చూడాలి.
  • 5 నుంచి 6రోజుల విరామంలో పెంపక గృహానికి చుట్టపక్కల 5శాతం హై గ్రేడ్‌ బ్లీచింగ్‌ పౌడరును పిచికారీ చేయాలి.
  • వ్యాధిగ్రస్థ క్రిములను సేకరించండి మరియు వాటిని సరిగ్గా పారవేయండి( కాల్చడం లేదా పూడ్చిపెట్టడం)
  • బెడ్‌ క్లీనింగ్‌ చేయడానికి ముందు మరియు తరువాత పెంపక గృహాన్ని 2శాతం బ్లీచింగ్‌ పౌడరుతో శుభ్రం చేయాలి.
  • మౌల్ట్‌ నుంచి లార్వా బయటకు వచ్చినప్పుడు, లార్వాపై బెడ్‌ నిర్జలీకరణిని ఉపయోగించండి.
ఆధారం:

సెంట్రల్‌ సెరికల్చర్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌, మైసూర్‌, కర్ణాటక