మెరుగుపరిచిన మల్బరీ రకాలు

వివిధ రకాలైన వ్యవసాయ వాతావరణ మరియు మట్టి అనువర్తనాల కొరకు మల్బరీ రకాలు

silks   silks silks silks silks

silks silks silks silks silks

విక్టరీ 1:

దీనిని వి1 అని ప్రముఖంగా పిలుస్తుంటారు. 1990ల చివర్లో ఎస్‌ 30 మరియు బెర్‌. సి 776 అనే హైబ్రిడ్‌ రకాల యొక్క నియంత్రణ పరాగ సంపర్కం ద్వారా ఇది ఎంచుకోబడిరది. నిట్టనిలువుగా ఉండే కొమ్మలు మరియు ఆకుపచ్చరంగులో కాండం రంగు ఉండటం అనేవి ఈ వెరైటీ యొక్క లక్షణాలు. ఆకులు మందంగా, సారం కలిగి, పెద్దవిగా ఉండి, అండాకార ఖండితాలను కలిగి ఉంటుంది. ఆకులు మృదువుగా మరియు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. గరిష్ట వేరు సామర్థ్యం, వేగంగా ఎదుగుదల మరియు గరిష్ట దిగుబడి వంటి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది.నీటి పారుదల సదుపాయాలు ఉన్నప్పుడు, సిఫారసు చేయబడ్డ యాజమాన్య విధానాల ద్వారా, సంవత్సరానికి హెక్టారుకు 60 మెట్రిక్‌ టన్నుల దిగుబడిని తీసుకోవచ్చు. బయోఅసే మరియు కీమో అసే టెస్టులు, పట్టుపురుగుల పెంపకంలో ఈ వెరైటీ యొక్క ఆధిక్యతను సూచిస్తాయి.

ఎస్‌ 36:

అతి తక్కువ కణుపులు, పాక్షికంగా కొమ్మలు నిలబడటం, మధ్యస్తంగా కొమ్మలు ఉండటం, ఆకుపచ్చ, గులాబీ రంగులో కాండం, ఆకులపై తమ్మెలు లేకుండా ఉండటం, ఆకు ఆకర్షణీయంగా ఉండి, లేత ఆకుపచ్చరంగుతో మృదువైన ఉపరితలాన్ని కలిగి ఉండటం ఈ వెరైటీ యొక్క లక్షణాలుగా పేర్కొనవచ్చు. సరైన నీటిపారుదల పరిస్థితుల్లో ఇది సంవత్సరానికి హెక్టారు విస్తీర్ణంలో 35 నుంచి 45 మెట్రిక్‌ టన్నుల ఆకును ఇస్తుంది. అధిక సత్తు మరియు పోషకాల నాణ్యత వల్ల చిన్న వయస్సులో ఉండే పట్టుపురుగుల పెంపకానికి ఇది సిఫారసు చేయబడుతుంది.

ఎస్‌ 13:

1986లో కన్వా2 యొక్క బాహ్య పరాగసంపర్క హైబ్రిడ్‌ రకాల నుంచి ఎంపిక చేయబడ్డ మల్బరీ రకమే ఎస్‌ 13. తక్కువ కణుపులు మరియు ఎక్కువ సంఖ్యలో కొమ్మలను ఏర్పరచడం అనేవి ఈ వెరైటీ యొక్క ప్రధాన లక్షణం. ఆకులు మందంగా మరియు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. తమ్మెలు లేకుండా మృదువైన ఉపరితలాన్ని కలిగి ఉంటుంది. వర్షాభావ ప్రాంతాల్లోను మరియు ఎర్ర మట్టినెలలకొరకు, గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండే ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరతఉండే ప్రాంతాల్లో ఉపయోగించడానికి సిఫారసు చేయబడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఇది సంవత్సరానికి హెక్టారు విస్తీర్ణంలో 12 నుంచి 15 మెట్రిక్‌ టన్నుల దిగుబడిని ఇస్తుంది.

ఎస్‌ 34:

: ఇది 1986లో ఎస్‌ 30 మరియు బెర్‌. సి 776 అనే హైబ్రిడ్‌ రకాల యొక్క నియంత్రణ పరాగ సంపర్కం ద్వారా ఇది ఎంచుకోబడిరది. వేగంగా వృద్ధి చెందడం మరియు లోతైన మరియు విశాలమైన వేరు వ్యవస్థలతోపాటుగా మట్టి తేమ మరియు ఒత్తడి పరిస్థితులకు తగ్గట్గుగా సర్దుబాట్లు చేసుకుంటుంది. ఆకులు మధ్యస్థం నుంచి విశాలంగా ఉంటాయి మరియు ఎలాంటి తమ్మెలు లేకుండా గరిష్టంగా తేమను కలిగి ఉండి, ఈ తేమను దీర్ఘకాలంపాటు నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఇది సంవత్సరానికి హెక్టారుకు 12 నుంచి 15 మెట్రిక్‌ టన్నుల దిగుబడిని ఇస్తుంది. ఇది నల్లరేగడి నేలలకు సిఫారసు చేయబడిరది.

సహానా:

2000సంవత్సరంలో కె2 ఎక్స్‌ యొక్క హైబ్రిడ్‌ రకాల ద్విముఖ పరాగసంపర్కం ద్వారా ఇది ఉద్భవించింది. మధ్యస్థంగా కొమ్మలు ఉండటం, వేగంగా వృద్ధి చెందడం,స్వల్పంగా విస్తరించడం, గులాబి .. బూడి రంగు కొమ్మలతో పాటు స్వల్పంగా కణుపులను కలిగి ఉంటుంది. ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి, ఎలాంటి తమ్మెలు ఉండవు, మందంగా, ఆకర్షణీయంగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. విస్తరించిన ఆకు ప్రాంతంలో పరిమిత ప్రాంతంలో నీడ ఉండే చోట ఈ వెరైటీ బాగా అభివృద్ధి చెందుతుంది. కొబ్బరితోటలో దీనిని అంతర పంటగా వేయవచ్చు( 25 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కొబ్బరితోటలో 8 మీటర్ల ఎడంగా మొక్కల్ని నాటవచ్చు) ఈ వెరైటీ సిఫారసు చేయబడ్డయాజమాన్య పద్ధతులు మరియు తగిన సాగునీటిని అందించడం ద్వారా సంవత్సరానికి హెక్టారుకు 25 నుంచి 30 మెట్రిక్‌ టన్నుల ఆకును ఉత్పత్తి చేయవచ్చు.

ఆర్‌సి1 ( రిసోర్స్‌ కన్‌స్ట్రైయిన్‌ 1):

2005వ సంవత్సరంలో పంజాబ్‌ లోకల్‌ మరియు కొసాన్‌ యొక్క క్రాస్‌ పోలినేషన్‌ హైబ్రిడ్స్‌ నుంచి ఈ వెరైటీ అభివృద్ధిచెందింది. ఇది వేగంగా ఎదుగుతుంది, మధ్యస్తంగాకొమ్మలుంటాయి. స్వల్పంగా విస్తరించిన గులాబి కొమ్మలతో పాటు చిన్న కణుపులను కలిగి ఉంటుంది.ఆకులు పెద్దవిగా ఉంటాయి. తమ్మెలను కలిగి ఉండి, మందంగా, ఆకర్షణీయంగా మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎరువులు మరియుసాగునీరు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ వెరైటీ అద్భుతంగా పనిచేస్తుంది. సిఫారసు చేయబడ్డ నీటిపారుదల మరియు ఎరువుల్లో 50శాతం వాడటం ద్వారా ప్రతి సంవత్సరం హెక్టారుకు 23 నుంచి 25 మెట్రిక్‌ టన్నుల దిగుబడి లభిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో సంవత్సరానికి హెక్టారుకు 45 నుంచి 50 మెట్రిక్‌ టన్నుల ఆకు దిగుబడి అవుతుంది.

ఆర్‌సి2: ( రిసోర్స్‌ కన్‌స్ట్రైయిన్‌ 2):

2005వ సంవత్సరంలో పంజాబ్‌ లోకల్‌ మరియు కొసాన్‌ యొక్క క్రాస్‌ పోలినేషన్‌ హైబ్రిడ్స్‌ నుంచి ఈ వెరైటీ అభివృద్ధిచెందింది. ఇది వేగంగా ఎదుగుతుంది, మధ్యస్తంగాకొమ్మలుంటాయి. స్వల్పంగా విస్తరించిన గులాబి కొమ్మలతో పాటు చిన్న కణుపులను కలిగి ఉంటుంది.ఆకులు పెద్దవిగా ఉంటాయి. తమ్మెలను కలిగి ఉండి, మందంగా, ఆకర్షణీయంగా మరియు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎరువులు మరియుసాగునీరు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ వెరైటీ అద్భుతంగా పనిచేస్తుంది. సిఫారసు చేయబడ్డ నీటిపారుదల మరియు ఎరువుల్లో 50శాతం వాడటం ద్వారా ప్రతి సంవత్సరం హెక్టారుకు 21 నుంచి 23 మెట్రిక్‌ టన్నుల దిగుబడి లభిస్తుంది. సాధారణ పరిస్థితుల్లో సంవత్సరానికి హెక్టారుకు 45 నుంచి 50 మెట్రిక్‌ టన్నుల ఆకు దిగుబడి అవుతుంది.

ఆర్‌12 (క్షార క్షమత):

ఎఆర్‌ 12 అనేది 2000సంవత్సరంలో ఎస్‌ ా 41(4ఎక్స్‌) మరియు బెర్‌ సి 776 అనే హైబ్రిడ్‌ వెరైటీల యొక్క క్రాస్‌ పాలినేషన్‌ నుంచి ఉద్భవించింది. ఇది వేగంగా ఎదిగే మల్బరీ రకం. క్షార భూమల్లో సైతం ఇది గరిష్ట వేర్ల సామర్థ్యాన్ని కనపరుస్తుంది. పొదలు స్వల్పంగా విస్తరిస్తాయి.కొమ్మలు మధ్యస్థంగా ఉంటాయి, బూడిదరంగులో ఉండి, చిన్న కణుపులను కలిగి ఉంటాయి. ఆకులపై తమ్మెలు పెట్టాయి, పెద్దవిగా, మందంగా, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఉపరితలం స్వల్పంగా గరుకుగా ఉంటుంది. హెచ్‌ స్థాయి 8.0 నుంచి 9.4 వకు ఉండే క్షార నేలలకు ఈ వెరైటీ ఎంతో తగినది. తగిన సాగు నీరు మరియు సిఫారసు చేయబడ్డ యాజమాన్య విధానాల ద్వారా సంవత్సరానికి హెక్టారుకు 25మెట్రిక్‌ టన్నుల దిగుబడిని పొందవచ్చు.

జి2:

2003సంవత్సరంలో ఎమ్‌. మల్టీ క్యూటిలస్‌ మరియు ఎస్‌ 34 అనే హైబ్రిడ్‌ రకాల యొక్క నియంత్రిత పరాగసంపర్కం ద్వారా ఈ జి2 అభివృద్ధి చెందించబడిరది. ఇది పొడవైన, మృదువైన, ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చ రంగులో స్వల్పంగా ఉంగరాలు తిరిగే విధంగా ఉండే ఆకుల్ని కలిగి ఉంటుంది. సంవత్సరానికి 8 పంటల షెడ్యూలు కింద (ప్రత్యామ్నాయంగా ఆకుల్ని తుంచడం మరియు షూట్‌ లెట్‌ సాగు )సంవత్సరానికి హెక్టారుకు 38 మెట్రిక్‌ టన్నుల చాకీ ఆకుల దిగుబడిని ఇస్తుంది. తక్కువ వయస్సు ఉండే పట్టుపురుగుల సాగు కొరకు ఈ వెరైటీని ఎక్కువగా ఉపయోగిస్తారు మరియు ప్రత్యేకంగా చాకీ గార్డెన్లు పెంచేటప్పుడు ఈ వెరైటీ సిఫారసు చేయబడుతుంది.

జి 4:

2003లో ఎమ్‌. మల్టీ క్యూటిలస్‌ మరియు ఎస్‌ 30 అనే హైబ్రిడ్‌ రకాల యొక్క క్రాస్‌ పాలినేషన్‌ద్వారా అభివృద్ధి చేయబడిరది. ఒపెన్‌ టైప్‌ పొదలు,వేగంగా ఎదగడం, ఎత్తుపై కొమ్మలు ఏర్పడటం వంటివి ఈ వెరైటీ యొక్క లక్షణాలు. కొమ్మలు తిన్నగా బూడిద రంగులో చిన్న కణుపులను కలిగి ఉంటుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో తమ్మెలు లేకుండా మందంగా మరియు ఉంగరాలు తిరిగి ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. ఇది గరిష్ట వేర్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తగిన నీరు మరియు సిఫారసు చేయబడ్డ యాజమాన్య విధానాల ద్వారా సంవత్సరానికి హెక్టారుకు 65 మెట్రిక్‌ టన్నుల దిగుబడి సాధ్యం అవుతుంది. వయస్సు ఎక్కువ పట్టు పురుగుల కొరకు ఈ వెరైటీ సిఫారసు చేయబడిరది

ఆధారం:

సెంట్రల్‌ సెరికల్చర్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌, మైసూర్‌, కర్ణాటక